అదృష్టవశాత్తు రవిభాయ్ ఇలాంటివి పట్టించుకోడు: కోహ్లీ

  • రవిశాస్త్రి నామమాత్రపు కోచ్ అంటూ విమర్శలు
  • స్పందించిన కోహ్లీ
  • శాస్త్రిని విమర్శించే వాళ్లు ఆ స్థాయి వ్యక్తులైతే బాగుంటుందని హితవు
టీమిండియా కోచ్ రవిశాస్త్రికి కెప్టెన్ విరాట్ కోహ్లీ బాసటగా నిలిచాడు. నామమాత్రపు కోచ్ అంటూ రవిశాస్త్రిని విమర్శించడం సరికాదని, కెప్టెన్ చెప్పిన ప్రతిదానికి తలూపడం మినహా మరే నిర్ణయం తీసుకోలేడని ఆయనపై ప్రచారం చేయడం తగదని కోహ్లీ హితవు పలికాడు.

ఇదంతా ఏం ఆశించి చేస్తున్నారో తెలియదు కానీ, అదృష్టం కొద్దీ రవిభాయ్ ఇలాంటివి పెద్దగా పట్టించుకోడని స్పష్టం చేశాడు. దురుద్దేశంతో సాగిస్తున్న ఇలాంటి ట్రోలింగ్ ను ఆపాలని విజ్ఞప్తి చేశాడు. పదో స్థానంలో ఆడే ఆటగాడిగా జట్టులోకి వచ్చి ఓపెనర్ గా ఎదిగిన వ్యక్తి రవిశాస్త్రి అని, రవిశాస్త్రిపై విమర్శలు చేసేవాళ్లు ఆయన స్థాయికి తగిన వ్యక్తులైతే బాగుంటుందని కోహ్లీ వ్యాఖ్యానించాడు. రవిశాస్త్రి ఎంతో సరదాగా ఉంటారని, ఇంట్లో కూర్చుని ట్రోలింగ్ చేసేవాళ్లను ఆయన లక్ష్యపెట్టడని తెలిపాడు.
Go Back to Shorts
Ravishastri
Virat Kohli
Cricket
India

More Telugu News